ETV Bharat / city

పుష్కరాలు పూర్తవ్వక ముందే.. బాగోతం బట్టబయలు..?

author img

By

Published : Dec 1, 2020, 4:15 PM IST

అన్ని హంగులతో పెద్ద భవంతిని నిర్మించుకున్నా రూ.కోటి అవ్వదు. పుష్కరాల్లో పుణ్య స్నానాల్లేవంటూనే... ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోట్లు కుమ్మరించింది. హడావుడి పనులతో నాణ్యతను పక్కనబెట్టారు గుత్తేదారులు. నాసిరకంగా పనులు జరుగుతున్నాయని 'ఈనాడు - ఈటీవీ - ఈటీవీభారత్' ఎప్పటికప్పుడు బయటపెడుతున్నా... అధికారులు కళ్లు తెరవలేదు. ఫలితంగా పుష్కరాలు పూర్తవ్వక ముందే నాణ్యత లోపం బయటపడుతోంది. ఇవేనా రూ.22.92 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఘాట్లు..? అంటూ భక్తులు ముక్కున వేలేస్తున్నారు. ఇదీ కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాల పనుల తీరు.

Ghats Damage In Kurnool District
పుష్కరాలు పూర్తవ్వక ముందే.. బాగోతం బట్టబయలు..?

హడావుడిగా పుష్కరాల ముందు రోజు పూర్తి చేసిన మేళిగనూర్‌ ఘాట్‌ నిర్మాణం అంచనా విలువ రూ.1.27 కోట్లుగా అధికారులు ప్రతిపాదించారు. రివర్స్‌టెండర్స్‌లో కడప జిల్లాకు చెందిన ఓ గుత్తేదారుడు 4.90% ఎక్కువగా కోట్‌ చేసి రూ.1.34కోట్లకు పనులు దక్కించుకున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక, గుత్తేదారు నిర్లక్ష్యంతో నాణ్యతకు తిలోదకాలివ్వడంతో ఘాట్‌ మధ్యలో చీలిక ఏర్పడింది.

కర్నూలు నగరంలోని నాగసాయి ఘాట్‌ సైతం రివర్స్‌ టెండర్లలో ఓ గుత్తేదారుడు 7.961 లెస్‌కు కోట్‌ చేశారు. రూ.1.10కోట్లతో ఘాట్‌ నిర్మాణ పనులు దక్కించుకున్నారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో ఒక్కో ఘాట్‌కు ఇలా రూ.కోటిపైగా ప్రతిపాదనలు చేశారు. తీరా గుత్తేదారు పనులు మొదలు పెట్టి మట్టి తీయగానే... పాత ఘాట్‌ మెట్లు దర్శనమిచ్చాయి. ఇంకేముంది కలిసొచ్చిన కాలం అనుకుంటూ పాత మెట్లకు కొత్త టైల్స్‌ వేశారు.

ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యం వహించారు. తీరా పుష్కరాలు ప్రారంభమయ్యాక భక్తులు మెట్లపై నడుస్తుంటే టైల్స్‌ కుంగిపోయి కింద పడిపోయే విధంగా తయారయ్యాయి. ఎక్కడ నాణ్యతాలోపాలు భయటపడతాయోనని గుత్తేదారుడు మళ్లీ టైల్స్‌ మధ్య ప్లాస్టింగ్‌ చేసి క్యూరింగ్‌ చేసిన ఘటనలు నాణ్యత తీరుకు అద్దం పడుతున్నాయి.

ఇదీ చదవండీ...

పరిశ్రమలకు ప్రోత్సాహకాల ప్రత్యేక ప్యాకేజీ.. ఉత్తర్వుల జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.