ETV Bharat / city

బిల్లులు రాక.. అప్పులు తీర్చలేక... ఊపిరే వదిలేశాడు - కర్నూలు జిల్లా తాజా వార్తలు

Contractor suicide: కాంట్రాక్టు పనులు పూర్తి చేశారు. బిల్లుల కోసం ఎదురుచూశాడు. అప్పటి వరకు కాలం గడపడానికి అప్పులు చేశాడు. బిల్లులు వచ్చేలా కనిపించలేదు. అప్పుల వాళ్లు పీకల మీద కూర్చున్నారు. ఎప్పుడు చెల్లిస్తావని నిలదీశారు. ఏం చేయాలో తోచలేదు. ఈ సమస్యలన్నింటికీ చావే పరిష్కారమని అనుకున్నాడు. పురుగుల మందుతాగి ఊపిరి వదిలేశాడు. ఇది ఓ గుత్తేదారు మరణగాథ. అసలేం జరిగిందంటే..?

Contractor suicide
గుత్తేదారు ఆత్మహత్య
author img

By

Published : Jun 10, 2022, 9:38 AM IST

Contractor suicide: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుసేనాపురానికి చెందిన గుత్తేదారు ఫక్కిరి మహబూబ్‌ బాషా (45) అప్పుల బాధతో గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబ్‌ బాషా మొదట్లో గడేకారి (ఇళ్ల నిర్మాణాలు) పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. కొన్నాళ్లుగా స్థానిక వైకాపా నాయకులతో కలిసి కాంట్రాక్టు పనులు చేశారు. ఓర్వకల్లులో ఆదర్శ పాఠశాల, ఉన్నత పాఠశాలలో ‘నాడు-నేడు’, కాల్వబుగ్గలో ఏపీ గురుకుల పాఠశాల, ఆర్బీసీ, సచివాలయం, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనుల్లో కాంట్రాక్టు భాగస్వామిగా ఉన్నారు. ఈ క్రమంలో రూ.80 లక్షల వరకు అప్పులు చేశారు.

బిల్లులు రాకపోవడం.. అప్పులు ఇచ్చిన వ్యక్తులు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ నెల 6న ఇంటి నుంచి వెళ్లిపోయారు. అతని భార్య ఫరీదా ఓర్వకల్లు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా చివరికి హైదరాబాద్‌లో గుర్తించారు. ఆ సమయంలో గ్రామానికి వచ్చేందుకు ఇష్టపడక, రెండ్రోజులు కర్నూలులో ఉండి వస్తానని కుటుంబసభ్యులకు చెప్పి బంధువుల ఇంట్లో ఉన్నారు. గురువారం తెల్లవారుజామున బంధువుల ఇంటి నుంచి వెళ్లి వెలుగోడులోని తన సొంత పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.