పెరిగిన ధరలతో భవన నిర్మాణ రంగం తీవ్ర నష్టాలకు గురవుతోందంటూ.. కర్నూలులో బిల్డర్లు ఆందోళన చేపట్టారు. సిమెంట్, స్టీలు ఉత్పత్తి దారులు కృత్రిమంగా ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి వారిని నియంత్రించాలని కోరారు.
రాష్ట్రంలో ఇసుక దొరకడంలేదని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నాయకులు ఆరోపించారు. లబ్ధిదారులకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: