Somu Veerraju: రాష్ట్రంలో అభివృద్ధిపై చర్చించేందుకు భాజపా సిద్ధంగా ఉందని, చర్చకు వైకాపా ముందుకు రావాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సవాల్ విసిరారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి, నికర జలాలను సాధించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 19న కడప జిల్లాలో ధర్నా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు కర్నూలు జిల్లా మంత్రాలయంలో తెలిపారు.
పోలవరం నిర్మాణ ఖర్చులను పూర్తిగా భరించనున్నట్లు కేంద్రం చెప్పిందని సోము వీర్రాజు అన్నారు. రూ.50 వేల కోట్లను ఎలా డ్రా చేసుకోవాలన్న తపన తప్ప.. ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. కడప జిల్లాలో అన్నమయ్య జలాశయం కొట్టుకుపోతే ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.
ఇదీ చదవండి: