విశాఖను రాజధానిగా చేయడానికే సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కర్నూలులోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రియల్ ఎస్టేట్ దందా కోసమే రాజధానిని మారుస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి చెందిన విశాఖను ముఖ్య పట్టణంగా మారిస్తే ఉపయోగమేంటని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో సీమకు ఒరిగే లాభమేమీ లేదన్నారు. నాటి నుంచి అన్ని విధాలా నష్టపోయినా సీమ ప్రాంతాన్ని... రేపటి కేబినెట్ భేటీలో రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : ఆగ్రహావతి: విధులు బహిష్కరించిన హైకోర్టు న్యాయవాదులు