ETV Bharat / city

చౌక దుకాణాల్లో నాసిరకం సరకు.. నిరాకరిస్తున్న బియ్యం కార్డుదారులు - low grade dal is sold in kakinada news

చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసే రాయితీ కందిపప్పు ధరను పెంచటంతో.. డీలర్లు సరకుకు డీడీ కట్టడానికి ముందుకు రాలేదు. పప్పు ఎక్కువ ధర, నాసిరకంగా ఉండటంతో.. కార్డుదారులు సైతం దాన్ని కొనటానికి ముందుకు రావటం లేదు. కాకినాడలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు ఇ.లక్ష్మీరెడ్డికి డీలర్లు వినతి పత్రం సమర్పించారు. నిల్వ కందిపప్పు సరఫరా చేయవద్దని, నాణ్యమైనది మాత్రమే ఇవ్వాలని కోరారు.

dal
చౌక దుకాణాల్లో నాసిరకం సరకు.. నిరాకరిస్తున్న బియ్యం కార్డుదారులు
author img

By

Published : Dec 13, 2020, 5:12 PM IST

చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసే రాయితీ కందిపప్పు ధరను అమాంతం కిలో రూ.67కు పెంచడంతో తూర్పుగోదావరి జిల్లాలోని డీలర్లు సరకుకు డీడీ కట్టడానికి ముందుకు రాలేదు. ఈనెల 5 నుంచి జిల్లాలో రేషన్‌ సరకులు పంపిణీ చేపట్టినా, డీలర్లు సుముఖత చూపకపోవడంతో అరువు పద్ధతిన వారికి కందిపప్పును చేరవేశారు. ప్రతి డీలరూ కనీసం క్వింటా తీసుకోవాలని ఆదేశించారు. దీనికి ఇప్పుడు సొమ్ములు చెల్లించవద్దని, వీరికి రావాల్సిన కమీషన్‌ నుంచి మినహాయించుకుంటామని పౌరసరఫరాల శాఖ మెలిక పెట్టింది. తీరా నాణ్యతలేని కందిపప్పు సరఫరా చేయడంతో, దీన్ని విక్రయించలేక రేషన్ కార్డుదారులు లబోదిబోమంటున్నారు. కాకినాడలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు ఇ.లక్ష్మీరెడ్డికి డీలర్లు వినతి పత్రం సమర్పించారు. మిగతా నిల్వ కందిపప్పు సరఫరా చేయవద్దని, నాణ్యమైనది మాత్రమే ఇవ్వాలని కోరారు.

dal
వై.కొత్తపల్లిలోని చౌకడిపోకు వచ్చిన పుచ్చిన కందిపప్పు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అర్బన్‌లోని 86వ నంబరు చౌక దుకాణంలో 768 కార్డులున్నాయి. ఇక్కడ ముగింపు నిల్వ కందిపప్పు 51కేజీలు ఉంది. ఈనెల 200 కిలోలను ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి సరఫరా చేశారు. శనివారం సాయంత్రం 7 గంటల వరకు 585 బియ్యంకార్డులకు బియ్యాన్ని పంపిణీ చేయగా, 156 మంది మాత్రమే కందిపప్పు తీసుకున్నారు.

dal
దుమ్ములపేటలోని చౌక దుకాణంలో నాసిరకంగా కందిపప్పు

పి.గన్నవరం మండలం వై.కొత్తపల్లిలోని చౌకడిపోలో 707 బియ్యం కార్డులున్నాయి. ఈ డిపోకు 250 కిలోల కందిపప్పు సరఫరా చేశారు. ఇది పురుగులుపట్టి పుచ్చిపోవటంతో శుక్రవారం నాటికి 38 కిలోలు మాత్రమే విక్రయించారు. బియ్యాన్ని మాత్రం 400 మంది పైగా కార్డుదారులు తీసుకెళ్లారు.

dal
కాకినాడ దుమ్ములపేటలో బియ్యం మాత్రమే తీసుకెళ్తున్న కార్డుదారులు

సమస్య ఏంటీ?

జిల్లాలోని చౌక దుకాణాల్లో సరఫరా అయిన కందిపప్పు నాసిరకంగా ఉంది. డిసెంబరు నెలకు జిల్లాలోని 16 లక్షలకు పైగా ఉన్న బియ్యం కార్డులకు 1,640 టన్నుల కందిపప్పు కేటాయించారు. గురువారం వరకు 600 టన్నులు సరఫరా చేశారు. నాణ్యత లేకపోవడంతో పేదలు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు.

బాబోయ్‌ అంత ధరా?

రాయితీ కందిపప్పును ఈ ఏడాది మార్చి వరకు కిలో రూ.40 చొప్పున చౌక దుకాణాల్లో పంపిణీ చేశారు. అనంతరం కరోనా నేపథ్యంలో తొమ్మిది నెలల వరకు ఉచితంగా కందిపప్పు, శెనగలను కార్డుదారులకు అందజేశారు. ఈ నెల నుంచి రేషన్‌ సరకులకు సొమ్ములు చెల్లించి మాత్రమే పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాయితీ కందిపప్పు ధర కిలో రూ. 67గా నిర్ణయించింది. ఏకంగా ఒకేసారి కిలోకు రూ.27 పెంచేశారు.

లబ్ధిదారుల గగ్గోలు

బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, చౌక దుకాణాలకు సరఫరా చేసినది నాణ్యంగా లేకపోవడంతో ఎక్కడికక్కడే సరకు మూలుగుతోంది. డీలర్ల వద్ద ముగింపు నిల్వ కింద ఉన్నది, తాజాగా జిల్లాలోని 19 మండలస్థాయి సరకు నిల్వ కేంద్రాల నుంచి సరఫరా చేస్తున్నది కూడా ఒకేలా ఉండటంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.

సరఫరా నిలిపివేశాం

చౌక దుకాణాలకు ప్రస్తుతం కందిపప్పు సరఫరా నిలిపివేశాం. కందిపప్పు నాణ్యత లేదని డీలర్లు నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఇక పంపిణీ చేయం. నాణ్యంగా ఉన్నది మాత్రమే సరఫరా చేయాలని ఇప్పటికే ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ఇన్‌ఛార్జిలకు ఆదేశాలిచ్చాం. డీలర్లపై బలవంతంగా ఈ సరకును రుద్దే ఉద్దేశం లేదు. పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఈ సమస్య ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కవగానే సరఫరా జరిగింది. పేదలకు నాణ్యమైన కందిపప్పును అందించడమే లక్ష్యం.

- ఇ.లక్ష్మీరెడ్డి, జిల్లా మేనేజరు, పౌరసరఫరాల సంస్థ

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.