ETV Bharat / city

New Officers: జిల్లాలకు 'నవ సారథులు' వీరే - కాకినాడ జిల్లాకు కలెక్టర్‌గా కృతికా శుక్లా

East Godavari Collectors: రాష్ట్రంలో కొత్త జిల్లాలు సోమవారం నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం శనివారం రాత్రి భారీ ఎత్తున ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. అలాగే పాలనను గాడిలో పెట్టేందుకు కొత్త సారథులను నియమించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

East Godavari Collectors
నూతన కలెక్టర్లు, ఎస్పీలు, జేసీల నియామకం
author img

By

Published : Apr 3, 2022, 11:58 AM IST

East Godavari Collectors: కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. పాలనను గాడిలో పెట్టేందుకు కొత్త సారథులను నియమించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 4న కొత్త జిల్లాల పాలన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆరోజే వీరంతా బాధ్యతలు స్వీకరించనున్నారు. కోనసీమ జిల్లా కలెక్టర్‌గా నియమితులైన హిమాన్షు శుక్లా, కాకినాడ జిల్లా కలెక్టర్‌గా నియమితులైన కృతికా శుక్లా దంపతులు.

  • కాకినాడ జిల్లాకు కలెక్టర్‌గా కృతికా శుక్లాను ప్రభుత్వం నియమించింది. ఈమె 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. మహిళాభివృద్ధి- శిశు సంక్షేమ, దిశ ప్రత్యేక అధికారిగా సేవలందిస్తూ జిల్లాకు బదిలీపై వచ్చారు. సంయుక్త కలెక్టర్‌గా ఎస్‌.ఇలాక్కియాను ప్రభుత్వం నియమించింది. 2017 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఈమె రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొత్త జిల్లాకు బదిలీపై వస్తున్నారు. ఉమ్మడి తూగో జిల్లా ఎస్పీ రవీరద్రనాథ్‌బాబును కాకినాడ జిల్లా ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
  • తూర్పుగోదావరి కలెక్టర్‌గా 2014 బ్యాచ్‌కు చెందిన కె.మాధవీలతను ప్రభుత్వం నియమించింది. ఈమె కృష్ణా జిల్లా రెవెన్యూ- రైతు భరోసా జేసీగా పనిచేస్తూ పదోన్నతిపై ఇక్కడికి వస్తున్నారు. జేసీగా చామకూరి శ్రీధర్‌ నియమితులయ్యారు. 2016 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఈయన చిత్తూరు జిల్లా జేసీ (అభివృద్ధి, గ్రామ, వార్డు సచివాలయాలు) బాధ్యతలు చూస్తూ ఇక్కడికి బదిలీ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ ఐశ్వర్య రస్తోగిని ప్రభుత్వం నియమించింది.
  • కోనసీమ జిల్లాకు కలెక్టర్‌గా 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి హిమాన్షు శుక్లాను ప్రభుత్వం నియమించింది. పశ్చిమ గోదావరి జిల్లా జేసీగా అభివృద్ధి- గ్రామ, వార్డు సచివాలయాల బాధ్యత చూస్తూ ఇక్కడికి బదిలీపై వస్తున్నారు. జేసీగా హెచ్‌ఎం.ధ్యానచంద్రను ప్రభుత్వం నియమించింది. 2017 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఈయన వైఎస్సార్‌ కడప జిల్లా జేసీగా పనిచేస్తూ ఇక్కడికి బదిలీపై వస్తున్నారు. ఎస్పీగా కె.ఎస్‌.ఎస్‌.వి.సుబ్బారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈయన ప్రకాశం జిల్లా విజిలెన్స్‌ ఎస్పీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వస్తున్నారు.
  • సుబ్బారెడ్డి 1991లో ఎస్సైగా పోలీస్‌శాఖలో ప్రవేశించారు. ఆయన సీఐ, అదనపు ఎస్పీగా పలుచోట్ల పని చేశారు. రెండేళ్ల కిందట ఏఎస్పీ హోదాలో ప్రాంతీయ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడే నాన్‌క్యాడర్‌ ఎస్పీగా, ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ (ఐపీఎస్‌) హోదా పొందారు. గతంలో ప్రకాశం జిల్లా పామూరులో వరదల వేళ తక్షణం స్పందించి పలువురి ప్రాణాలను కాపాడారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఆయనకు యగ్జాలేటరీ ప్రొబేషన్‌ కల్పించింది. ఎస్సైగా ప్రవేశించి ఐపీఎస్‌గా ఎదిగారు.

కలెక్టర్‌ సి.హరికిరణ్‌: వ్యవసాయ శాఖ కమిషనర్‌గా నియమితులయ్యారు. జులై 31, 2021న బాధ్యతలు చేపట్టారు. ఇళ్ల నిర్మాణాలు, ఓటీఎస్‌ లక్ష్యసాధన, పోలవరం ముంపు సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు.

జేసీ సుమిత్‌: జేసీ (రెవెన్యూ) సుమిత్‌కుమార్‌ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా వెళ్తున్నారు.

కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌..: రాజమహేంద్రవరం నగర పాలక కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ పశ్చిమగోదావరి జిల్లా జేసీగా వెళ్తున్నారు.

జేసీలు కీర్తి, భార్గవ్‌తేజ: గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్‌గా కీర్తి చేకూరి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్‌గా భార్గవ్‌తేజ బదిలీ అయ్యారు.

పీవో ప్రవీణ్‌ ఆదిత్య..: రంపచోడవరం ఐటీడీఏ పీవో సీవీ ప్రవీణ్‌ ఆదిత్య పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు పరిపాలనాధికారిగా వెళ్తున్నారు.

విజిలెన్స్‌ ఎస్పీ రవిప్రకాష్‌: జిల్లా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు ఎస్పీ యు.రవిప్రకాష్‌ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా వెళ్తున్నారు.

కమిషనర్‌ పుండ్కర్‌: కాకినాడ కమిషనర్‌ పుండ్కర్‌ విజయవాడ కమిషనర్‌గా వెళ్తున్నారు.

కమాండెంట్‌ గరుడ్‌ సుమిత్‌: ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌ కమాండెంట్‌ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ విశాఖ డీసీపీగా వెళ్తున్నారు.

చేతన్‌

రాజమహేంద్రవరం కమిషనర్‌గా చేతన్‌: రాజమహేంద్రవరం కమిషనర్‌గా చేతన్‌ నియమితులయ్యారు. ప్రకాశం జిల్లా జేసీగా పనిచేస్తూ ఇక్కడికి బదిలీపై వస్తున్నారు.

ఐటీడీఏ పీవోగా నిశాంతి: అనంతపురం హౌసింగ్‌ జేసీగా ఉన్న టి.నిశాంతిని రంపచోడవరం ఐటీడీఏ పీవోగా నియమించారు.

ఇదీ చదవండి: Bullet Bike Blast: బైక్​లో మంటలు.. భారీ శబ్దంతో పేలుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.