ETV Bharat / sports

రోహిత్, విరాట్ మళ్లీ ఫెయిల్- రిటైర్మెంట్​పై రవిశాస్త్రి కామెంట్స్ - ROHIT KOHLI RETIREMENT

రెండో ఇన్నింగ్స్​లోనూ రోహిత్, విరాట్ ఫెయిల్- సీనియర్ల రిటైర్మెంట్​పై శాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Rohit Kohli Retirement
Rohit Kohli Retirement (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 30, 2024, 10:27 AM IST

Rohit Kohli Retirement : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెల్‌బోర్న్‌ టెస్టులోనూ ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్‌ నిర్దేశించిన 340 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ (9 పరుగులు), విరాట్ (5 పరుగులు) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. దీంతో వారిద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ హెడ్ కోచ్‌ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.

విరాట్ మరో 3-4 ఏళ్లు కెరీర్‌ను కొనసాగించాలని, రోహిత్‌ మాత్రం ఈ సిరీస్‌ ముగిశాక ఏదో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని అన్నాడు. 'విరాట్ కోహ్లీ ఇంకా కొన్నాళ్లు ఆడొచ్చు. కనీసం మూడేళ్లు ఆడే అవకాశం ఉంది. అతడి ఫిట్‌నెస్ కూడా బాగుంది. ఈరోజు అతడు ఔటైన విధానాన్ని వెంటనే మరిచిపోవాలి. ఇక కెప్టెన్ రోహిత్ విషయంలో ఆందోళన తప్పడం లేదు. ఏదైనా సరే అతడే నిర్ణయం తీసుకోవాలి. టాప్‌ ఆర్డర్‌లో ఆడేటప్పుడు అతడి ఫుట్‌వర్క్‌ మెరుగ్గా లేదు. అందుకే పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నాడు. బంతిని చాలా ఆలస్యంగా ఆడుతున్నాడు. సిరీస్‌ ముగిశాక ఏదొక నిర్ణయం తీసుకుంటాడని అనుకుంటున్నా'

'రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ ఔటైన తీరు ఇబ్బందికరమే. సాధారణంగా అతడు ఫ్రంట్‌ ఫుట్ మీద బంతిని చాలా చక్కగా ఆడతాడు. కానీ, ఈసారి పుల్‌ చేయబోయి పెవిలియన్‌కు చేరాడు. రోహిత్‌ ఆడేటప్పుడు ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో ఎటాక్‌ చేసేందుకు రోహిత్ ప్రయత్నించాడు. అదే సమయంలో వారికి దొరికిపోయాడు. ఆసీస్ ఒక స్పెల్​లో చేసిన అత్యుత్తమ బౌలింగ్ ఇదే అనుకుంటున్నా' అని శాస్త్రి పేర్కన్నాడు.

కాగా, ఈ సిరీస్​లో రోహిత్ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. రెండో, మూడో టెస్టులో ఆరో స్థానంలో బ్యాటింగ్​కు దిగిన హిట్​మ్యాన్ వరుసగా 3, 6, 10 స్కోర్లు నమోదు చేశాడు. ఇక ఈ టెస్టులో ఓపెనర్​గా వచ్చినప్పటికీ ఆకట్టుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్​లో 3, రెండో ఇన్నింగ్స్​లో 40 బంతులు ఆడినప్పటికీ 9 పరుగులే చేసి నిరాశపర్చాడు.

ఆసీస్ బ్యాటర్​పై రోహిత్ ఫైర్- చెబితే వినాలిగా మరి!

'విరాట్, రోహిత్ కాదు- అక్కడ నేనే ఇంపార్టెంట్ ప్లేయర్!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.