మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును ఆయన కుమార్తె సునీత పర్యవేక్షించారు. పులివెందుల పరిధిలోని రోటరీపురం, గుర్రాల గడ్డ వంకలో ఆయుధాల అన్వేషణ కోసం సీబీఐ అధికారులు చేపట్టిన పనులను ఆమె పరిశీలించారు. దర్యాప్తు ఏవిధంగా సాగుతోందని.. సీబీఐ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఉదయం కూడా ఆమె సీబీఐ అధికారులను కలిసి వివరాలపై ఆరా తీశారు. సాయంత్రం సునిల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు వివేకా ఇంటి పరిసరాలకు తీసుకెళ్లి పరిశీలించారు. హత్య జరిగిన తర్వాత ఇంటి నుంచి దుండగులు ఏవిధంగా పారిపోయారనేదానిపై సునీల్ ద్వారా అధికారులు రికార్డు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: