వరదల కారణంగా తిరుపతి (Heavy rains in Tirupathi)వెళ్లాల్సిన పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చింది. విశాఖ నుంచి తిరుపతికి నిన్న బయలు దేరిన తిరుమల ఎక్స్ప్రెస్ను కడపలో ఆపి వేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం (passengers fired on railway officers) చేస్తున్నారు.
వైజాగ్ నుంచి తిరుపతికి తిరుమల ఎక్స్ప్రెస్ (Tirumala Express) నిన్న ఉదయం బయలుదేరింది. విజయవాడకు వచ్చిన తర్వాత అధికారులు కడప జిల్లాలో భారీ వర్షాల వల్ల రైల్వే వంతెన దెబ్బతిందని చెప్పి ప్రయాణికులు విజయవాడలో దిగిపోయారు. అయితే మళ్లీ రైల్వే అధికారులు వెళ్ళవచ్చని చెప్పడంతో ప్రయాణికులందరూ రైలు ఎక్కారు. ఈరోజు ఉదయం 9 గంటలకు రైలు కడప రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత రాజంపేట మార్గంలో రైల్వే వంతెన దెబ్బతిన్నదని రైలు వెళ్లదని చెప్పడంతో ప్రయాణికులు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. దాదాపు 2000 మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లో ఆందోళనకు దిగారు. రైల్వే అధికారులతో వాగ్వాదం జరిగింది. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వలనే ఇలా సమస్య వచ్చిందని ప్రయాణికులు ఆగ్రహించారు. రైల్వేస్టేషన్ లో కనీసం మంచినీళ్లు కూడా లేవని పిల్లలతో ఎలా ఉండాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.పరిస్థితిని గమనించిన రైల్వే అధికారులు వెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ప్రయాణికులందరినీ బస్సులో తిరుపతికి తరలిస్తున్నారు. తాము చెల్లించిన టికెట్ నగదు తిరిగి ఇవ్వాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి : FLOODS :చెరువులకు చెర....వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకులు