ETV Bharat / city

విసిరితే లక్ష్యం చేరాల్సిందే... విలువిద్యలో కడప యువకుడి ప్రతిభ - విలువిద్యలో ఉదయ్​ కుమార్​

విలువిద్య.. అని అనగానే అందరికీ గుర్తొచ్చేది అర్జునుడు.. పురాణాలు, ఇతిహాసాలు ఈ విద్యకున్న గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఇందులో ఆరితేరిన వారి విజయాల ప్రస్తావనలను గుర్తుచేస్తాయి. అలాంటి విలువిద్యలో అత్యుత్తమ ప్రతిభ చాటుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పతకాలు సాధిస్తున్నాడు. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాడు ఈ యువకుడు. ఒకే సారి మూడు బాణాలు సంధించే నైపుణ్యంతో అందరినీ ఆశ్యర్యపరుస్తున్నాడు. ప్రాచీన యుద్ధకళలు భావితరాలకు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు యువ క్రీడాకారుడు. అతడెవరో.. ఆ విశేషాలేంటో మీరూ చదివేయండి.

uday kumar in archery
విలువిద్యలో ఉదయ్​కుమార్​
author img

By

Published : Feb 15, 2022, 1:10 PM IST

విలువిద్య..! లక్ష్యంపై గురి పెడితే ఎంతటి దూరాన్నైనా చేధించవచ్చంటారు. ఆ విద్యలో అద్భుతంగా రాణిస్తున్నాడు.. ఇండియా గాట్ టాలెంట్‌ షోలో ప్రదర్శనతో గుర్తింపు పొంది గ్రామీణస్థాయిలో కనుమరుగవుతున్న ఈ విద్యలో ప్రతిభ చాటడంతో పాటు.. ప్రచారం కల్పిస్తున్నాడు కడపకు చెందిన ఉదయ్‌ కుమార్‌ అనే యువకుడు.

విలువిద్యలో ఉదయ్​కుమార్​

కడప జిల్లాకు చెందిన ఉదయ్‌... 2007లో మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందాడు. విలువిద్యలో శిక్షణ తీసుకునేందుకు 2010లో చెన్నైకి వెళ్లాడు. అనతికాలంలోనే ఆర్చరీలో పట్టు సాధించాడు. 2015లో ముంబయిలో జరిగిన జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో కాంస్యం గెలుచుకున్నాడు. 2018 లో 15 నిమిషాల 15 సెకన్లలో 200కుపైగా బాణాలు వేగంగా సంధించి ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నాడు. 2019లో న్యూజిలాండ్‌లో జరిగిన ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీల్లో రజతం సాధించాడు..

ఆర్చరీలో లెవల్-1, లెవల్-2, లెవల్-3 హోదాలు ఉన్నాయి. 2021లో ట్రెడిషన్ ఆర్చరీ సంస్థ జాతీయస్థాయిలో నిర్వహించిన పరీక్షలో రెండో స్థానం కైవసం చేసుకుని లెవల్-2 పరీక్షలో విజయం సాధించాడు. ప్రస్తుతం దేశంలో ఆర్చరీ లెవల్-2 కోచ్ లు నలుగురు మాత్రమే ఉండగా.. వారిలో ఉదయ్ కుమార్ ఒకడు. ప్రస్తుతం లెవల్-2 హోదాలో ఉన్న ఉదయ్.. ధనుర్విద్యలో చెప్పిన విధంగా అన్ని విభాగాల్లో బాణాలు వేయగలడు.

ఇటీవలే ముంబయిలో ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ఇండియాస్‌ గాట్ టాలెంట్ రియాల్టీషోలో ఉదయ్ కుమార్ పాల్గొని అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఒకేసారి రెండు బాణాలు సంధించి లక్ష్యాన్ని చేధించి.. నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

విలువిద్య గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు.. దేవాలయాల్లోని శిల్పాలు, గ్రంథాలయాల్లోని పుస్తకాలకే ఈ విద్య పరిమితమైంది. భవిష్యత్ తరాల కోసం పుస్తకాల్లో ఉన్న విలువిద్యను ప్రయోగాత్మకంగా చూపించాలని ఓ ఛానల్​ వేదికగా ఇండియా వాస్​ ట్యాలెంట్​ అనే కార్యక్రమాన్ని నిర్వహించాను. అందులో ప్రాచీన ధనుర్విద్య గురించి వివరించాను. విలువిద్య అనేది ఏకాగ్రతను పెంచే ఒక గొప్ప కళ. పాఠశాలల్లో సిలబస్​గా పెడితే ధనుర్విద్య సంస్కృతి అభివృద్ధి చెందుతుంది.-ఉదయ్ కుమార్, ఆర్చరీ క్రీడాకారుడు

ధనుర్వేదంలో చెప్పిన విధంగా విలువిద్యకు సంబంధించి అనేక గ్రంథాలు రచించారు. వాటిలో వశిష్ట ధనుర్వేదం, సదాశివ ధనుర్వేదం, హరిహర చతుర్రంగం, రుగ్వేదం, యజుర్వేదం వంటి గ్రంథాలు ప్రాచీన భారతీయ యుద్ధ కళలలను తెలియజేస్తున్నాయి. ప్రభుత్వాలు కాస్త ప్రోత్సహిస్తే ఒలింపిక్స్‌లో పతకాల వేటలో మనమే ముందుంటామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు ఉదయ్‌.

ఉదయ్ కుమార్ 2013లో కడపలోనే విజయ్ ఆర్చరీ అకాడమీ నెలకొల్పాడు. 2017లో బెంగళూరులోనూ అకాడమీ స్థాపించాడు. ఇప్పటి వరకు దాదాపు 2 వేల మంది క్రీడాకారులకు ఆర్చరీలో శిక్షణ ఇచ్చాడు. కడపజిల్లా నుంచే 250 మంది పిల్లలు జాతీయ, అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో పాల్గొని.. 70 వరకు బంగారు పతకాలు కైవసం చేసుకోవడం విశేషం.

ఇప్పటివరకు 3బాణాలు సంధిస్తున్న ఉదయ్‌... రాబోయే రోజుల్లో ఒకేసారి 5 బాణాలు వేయడమే తన లక్ష్యంగా చెబుతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో విలువిద్య ఖరీదైన క్రీడగా మారి పోయింది. ఈ నేపథ్యంలో.. ఆర్చరీపై ఆసక్తి కనబరిచేవారికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతున్నాడు.

ఇదీ చూడండి: పూర్ణ.. ఓ "పవర్" స్టార్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.