ETV Bharat / city

బుగ్గవంకకు రక్షణ గోడలు లేక.. పొంచి ఉన్న పెనుముప్పు - కడప బుగ్గనవంక రక్షణ గోడల నిర్మాణం వార్తలు

2001 అక్టోబర్ 16.. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయం.. కడప నగరాన్ని బుగ్గవంక అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా వచ్చిన ప్రవాహం కడపను ముంచెత్తింది. ఈ విషాద ఘటనలో ఎందరో మృత్యువాత పడ్డారు. వందల ఇళ్లు నీట మునిగాయి. కడప నుంచి ప్రవాహించే బుగ్గవంకకు సరైన రక్షణ గోడలు లేక...ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తేల్చారు. రక్షణ గోడ నిర్మాణానికి టెండర్లు పిలిచినా.. ఆక్రమణలు అడ్డంకిగా మారాయి. దాదాపు రెండు దశాబ్దాలు గడిచినా ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో...ఏ రాత్రి ఏ ప్రమాదం ముంచుకోస్తుందో అని స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు.

బుగ్గవంకకు రక్షణ గోడలు లేక పొంచి ఉన్న పెనుముప్పు

author img

By

Published : Oct 7, 2020, 6:21 PM IST

ఇటీవల కురిసిన వర్షాలకు కడపజిల్లా చింతకొమ్మదిన్నె మండంలోని బుగ్గవంక ప్రాజెక్టులో భారీగా నీరు చేరింది. కడప నగరం మీదుగా బుగ్గవంక ప్రవహిస్తుంది. నగరంలో బుగ్గవంక కాలువలకు రక్షణ గోడలు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇప్పటికే రెండు సార్లు టెండర్లు పిలిచినా... ఆక్రమణల తొలగింపు అడ్డంకిగా మారి గుత్తేదారులు చేతులెత్తేశారు. ఇప్పుడు మరోమారు టెండర్లు పిలిచినా... వాటిని రక్షణ గోడల నిర్మాణానికి కాకుండా రహదారుల నిర్మాణం కోసం వెచ్చిస్తున్నారు.

2001లో విషాద ఘటన

బుగ్గవంక ప్రాజెక్టుకు వరద పోటెత్తితే....నాలుగు గేట్లు ఎత్తివేస్తారు. గేట్లు ఎత్తితే కడప నగరంలోని బుగ్గవంక కాలువల ద్వారా 33 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. కానీ 2001 అక్టోబరు 16న ఒకేసారి 69 వేల క్యూసెక్కుల వరద నీరు బుగ్గవంకకు రావడం వల్ల కడప నగరం జలదిగ్భంధంలో చిక్కుకుంది. నాడు బుగ్గవంక ప్రాజెక్టు నుంచి 33 వేల క్యూసెక్కులు, మూలవంక నుంచి 36 వేల క్యూసెక్కుల వరద ఒకేసారి కలిసి రావడం వల్ల బుగ్గవంక సామర్థ్యానికి మంచి ప్రవహించింది. ఫలితంగానే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. అనంతరం అధికారం చేపట్టిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ...బుగ్గవంక సుందరీకరణ చేపట్టాలని 2005లో నిర్ణయం తీసుకున్నారు.

2005లో రూ.35 కోట్లు విడుదల

కడప శివారులోని రైల్వే బ్రిడ్జి నుంచి అల్మాస్ పేట వరకు బుగ్గవంక కొనసాగుతోంది. ఇరువైపులా కలిపి 8.2 కిలోమీటర్ల వరకు బుగ్గవంక ఉంది. అయితే బుగ్గవంక సామర్థ్యం 69 వేల క్యూసెక్కులకు పైగానే తట్టుకునే విధంగా కాల్వలు వెడల్పు చేయడం, రక్షణ గోడలు ఎత్తుగా నిర్మించడంతో పాటు రెండు... డబుల్ హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. బుగ్గవంక రక్షణ గోడల కోసం 2005లో ప్రభుత్వం రూ.35 కోట్లు విడుదల చేసింది. అనంతరం పనులు ప్రారంభించిన గుత్తేదారు ఆక్రమణను తొలగించలేక...రూ.13 కోట్ల పనులు చేసి ఒప్పందం రద్దు చేసుకున్నారు.

ఆక్రమణల అడ్డంకి

మళ్లీ 2007-08 సంవత్సరంలో సవరించిన అంచనాలతో మిగిలిన పనిని పూర్తి చేసేందుకు రూ.33.54 కోట్లతో టెండర్లు పిలిచారు. పనులు ప్రారంభించిన గుత్తేదారుకి సైతం ఆక్రమణలు అడ్డంకిగా మారి 2016 జులై 1న పనులు నిలిపివేశారు. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు మూడోసారి 2015 నవంబరు 27న రూ.69 కోట్ల 87 లక్షల అంచనాతో ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు బుగ్గవంకలో రక్షణ గోడలు, ఇతర పనులను ఇద్దరు గుత్తేదారు సంస్థలు 8150 మీటర్ల పొడవులో 6950 మీటర్ల పని పూర్తి చేశారు. ఇక మిగిలింది 1200 మీటర్ల పని. బుగ్గవంక రక్షణ గోడల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.69.87 కోట్లల్లో.. ఇక మిగిలింది రూ.14.29 కోట్లు. ఆ నిధులతో మిగిలిన ప్రాంతం రక్షణ గోడలు నిర్మించాలంటే ఆక్రమణలు అడ్డంకిగా మారాయి.

ఇలాంటి పరిస్థితుల్లో నాలుగురోజుల కిందట బుగ్గవంకలో ఇద్దరు చిన్నారులు రక్షణగోడ లేని ప్రాంతంలో గల్లంతయ్యారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కడప నగరంలోని రవీంద్రనగర్, నాగరాజుపేటలోని కొంతభాగంలో బుగ్గవంక సమీపంలో కట్టడాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ అధికారులు ఆక్రమణలు తొలగించడానికి చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బుగ్గవంక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

గొడవ ఆపేందుకు ప్రయత్నించబోతే... లారీ కింద తోసేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.