కడపలో రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరం మొత్తం జలమయమైంది. కడప ఆర్టీసీ గ్యారేజ్ లోకి భారీగా వర్షం నీరు చేరడంతో కార్మికులు అవస్థలు పడ్డారు. గ్యారేజీ మొత్తం బ్యారేజీని తలపించింది. వర్షం నీటిలో కార్మికులు విధులు నిర్వహించాల్సి వచ్చింది. నగరంలోని ఆర్టీసీ కార్మికుల భవనాలు, భరత్ నగర్, వై జంక్షన్, రాజంపేట బైపాస్ రోడ్డు, అప్సర కూడలి, మృత్యుంజయ కుంట, భాగ్యనగర్ కాలనీ, గంజికుంట కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురికి కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి పలు కాలనీల్లోకి మీరు వెళ్లడంతో రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: TIDCO houses : రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకడుగు...