ETV Bharat / city

నవరత్నాలు దెబ్బతీశాయి.. వైకాపా సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో వైకాపా పాలన గాడి తప్పుతోందని.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎక్కడికి పోతుందో అర్థం కావడం లేదని వైకాపా నేత డీఎల్ రవీంద్రారెడ్డి(DL RAVINDRA REDDY ON FINANCIAL SITUATION IN THE STATE) అన్నారు. సంక్షేమ పథకాల పేరిట అధికంగా అప్పులు చేయడాన్ని తప్పుపట్టారు.

DL RAVINDRA REDDY
డీఎల్‌ రవీంద్రారెడ్డి
author img

By

Published : Oct 17, 2021, 1:17 PM IST

‘రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ పాలన గాడి తప్పుతోంది.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎక్కడికి పోతుందో అర్థం కావడం లేదు’ అని కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైకాపా నేత డీఎల్‌ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులుగా ఉన్నవారు ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. అన్ని శాఖల తరఫున ఒకే నేత భరోసా ఇస్తున్నారని పరోక్షంగా సజ్జలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలను ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. దానికి ఇంకా రెండేళ్ల సమయం ఉందని.. ఏ పార్టీ అయితే ప్రజల కోసం పనిచేస్తుందనే నమ్మకం ఉంటుందో.. అప్పుడు ఆలోచించి ఆ పార్టీలో చేరే విషయమై నిర్ణయం తీసుకుంటానని అన్నారు. కడప జిల్లా ఖాజీపేటలో ఈ మేరకు రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

''రాష్ట్ర ఆదాయాన్ని, ప్రగతిని, ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు చేయడం చాలా తప్పు. దేనికైనా పరిమితులు ఉంటాయి. కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. నవరత్నాల పథకం మంచిదని భావించాను. అవి రాష్ట్ర ప్రగతిని దెబ్బతీస్తాయని అనుకోలేదు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ పథకాలు దారి తప్పాయి. ఈ వ్యవస్థ గాడిన పడాలంటే మరో 25 ఏళ్లు పడుతుందని మేధావులు చెబుతున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు ప్రతి చేనేత కుటుంబానికి రూ.50 వేలు ఇస్తామన్న మాట ఉత్తిదే. అందరికీ అందడం లేదు. కొన్ని పథకాల డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేస్తుండటం కొంతవరకు మంచిదే. రేషన్‌ బియ్యం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ఆధునికీకరణ, రాజోలి రిజర్వాయర్‌ పనులు ముందుకు కదలడం లేదు. గుత్తేదారులకు డబ్బులిచ్చే పరిస్థితి లేకపోవడమే ఇందుకు కారణం. విద్యుత్తు సంక్షోభం ఎందుకు వచ్చిందో ఆలోచన చేయాలి. ఇంధనశాఖ కార్యదర్శి తెలివి గల వ్యక్తేగానీ.. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మంత్రులకే సీఎం దర్శనం లేకపోతే.. నాలాంటి వ్యక్తికి దొరకడం కష్టం.'' - డీఎల్‌ రవీంద్రారెడ్డి, వైకాపా నేత

ఇదీ చదవండి:

DL RAVINDRA REDDY: పార్టీ టికెట్ ఇవ్వకపోయినా పోటీచేస్తా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.