సుమారు ఏడాదిన్నర అనంతరం కడప జిల్లా ఆర్టీసీకి కోటి రెండు లక్షల రూపాయలు ఆదాయం రావడంతో అధికారులు ఖుషి ఖుషీగా ఉన్నారు. కరోనాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీకి మొదటిసారిగా కోటి రెండు లక్షల ఆదాయం వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 8 డిపోల్లో పరిధిలో రోజుకు 600 ఆర్టీసీ బస్సులు, 228 అద్దె బస్సులను తిప్పుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాలతో పాటు తిరుపతి, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, తదితర జిల్లాలకు కూడా బస్సులను నడుపుతున్నారు. బద్వేల్ డిపోకు రూ.9.03 లక్షలు, జమ్మలమడుగు రూ.9.02 లక్షలు, కడప 23 లక్షల 39 వేలు, మైదుకూరు రూ.6.42 లక్షలు, ప్రొద్దుటూరు రూ.17.54 లక్షలు, పులివెందుల రూ.13.61లక్షలు, రాజంపేట రూ.10.14 లక్షలు, రాయచోటి రూ.13.83 లక్షలు ఆదాయం రావడంతో అధికారులు, కార్మికులు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు. మరింత ఆదాయం పెంచేందుకు కృషి చేస్తామని ఆర్టీసీ ప్రాంతీయ అధికారి జితేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో భారీ సౌరవిద్యుత్ ప్రాజెక్టులు?