Papigenni Ramakrishna reddy: "ఎవరూ లేనివారికి ఆ దేవుడే దిక్కు" అని చాలా మంది అంటారు. అది నిజమో కాదో తెలియదు కానీ.. అనాథలకు నేనున్నాను అంటున్నారు వివేకానంద ఫౌండేషన్ రూపకర్త పాపిజెన్ని రామకృష్ణారెడ్డి. గత కొంత కాలంగా అనాథలకు అండగా నిలుస్తున్న ఆయన మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.
కడప జిల్లా యర్రగుంట్ల ప్రధాన రహదారిపై ఎన్నో ఏళ్లుగా అనాథగా తిరుగుతున్న ఓ వృద్ధుడిని చూసిన రామకృష్ణారెడ్డి అతడిని ఆదుకున్నారు. అపరిశుభ్రంగా ఉన్న వృద్ధుడిని ఓ చోటుకు తీసుకొచ్చి క్షవరం చేయించారు. అతడికి స్నానం చేయించారు. అనంతరం కొత్త వస్త్రాలను వేశాడు. కడుపునిండా ఫలహారం తినిపించారు. అంతేనా ఆ వృద్ధుడు నడవడానికి సాయంగా ఓ కర్రను సైతం అందించాడు... రామకృష్ణారెడ్డి. ఆయన సేవలను చూసి స్థానికులు గొప్పగా చెప్పుకొంటున్నారు.
ఇదీ చదవండి: Fire In Forest: అడవిలో అంటుకున్న మంటలు... ఆందోళనలో ప్రజలు..