రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. క్రిస్మస్ పర్వదినంతో పాటు జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు సీఎం మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీన విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కడప, రాయచోటి, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు.
పర్యటన సాగనుందిలా...
ఈ నెల 23వ తేదీ ఉదయం 8.10 గంటలకు సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 8.50 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 9.00 గంటలకు రాయచోటి రోడ్డులో నూతనంగా నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన రిమ్స్‌కు బయలుదేరి 9.50 గంటలకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ ఉచిత భోజన వసతి భవనాన్ని 10.30 గంటలకు ప్రారంభిస్తారు. అక్కడి నుంచి హెలిప్యాడ్‌కు చేరుకుని 11 గంటలకు జమ్మలమడుగులోని సున్నపురాళ్ల పల్లెకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. సుమారు 11.45 గంటలకు స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. అక్కడే నిర్మించిన ఉక్కు కర్మాగారానికి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు.
ఇడుపులపాయ చర్చిలో ప్రార్థనలు..!
24వ తేదీ ఉదయం 9 గంటలకు ఇడుపులపాయలోని అతిథిగృహం నుంచి బయలుదేరి 9.10 గంటలకు వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇడుపులపాయ చర్చికి వెళ్లి ప్రార్థనలు నిర్వహిస్తారు. భోజనం తర్వాత ఇడుపులపాయలో 1.35 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో రాయచోటికి బయలుదేరుతారు. 25వ తేదీన ఉదయం 9 గంటల ప్రాంతంలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. 11.15 గంటలకు పులివెందుల జూనియర్ కళాశాలకు చేరుకుని నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
ఇదీ చదవండి: