ETV Bharat / city

sailajanath : 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజావ్యతిరేకతే కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తుంది' - badvel by-poll news

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజావ్యతిరేకతే కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తుందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ అన్నారు. బద్వేలు నియోజకవర్గాన్ని గతంలో అభివృద్ధి బాటలో నడిపించిన కాంగ్రెస్‌ అభ్యర్థి కమలమ్మను గెలిపించాలని ఓటర్లను కోరారు.

పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌
పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌
author img

By

Published : Oct 17, 2021, 5:58 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న ప్రజావ్యతిరేకతే... కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సాకే శైలజానాథ్ అన్నారు. విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ ధరలతో ఎవరికి ఓటు వేయాలి అనేది ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి కమలమ్మ... గతంలో ఎమ్మెల్యేగా ఎంతో సేవ చేశారని తెలిపారు. ఈ సారీ కమలమ్మను గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని శైలజానాథ్ స్పష్టం చేశారు.

బద్వేలు పట్టణానికి తాగునీరు అందించిన ఘనత కమలమ్మది. సామాన్యుని హక్కులను కాపాడేందుకు ఎస్సీ కమిషన్​లో అవిశ్రాంతంగా కృషి చేశారు. కమలమ్మను గెలిపిస్తే అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తాం. రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉంది. -సాకే శైలజానాథ్, పీసీసీ అధ్యక్షుడు

పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌

ఇదీచదవండి. తెలంగాణ : సెల్ఫీ సరదా... రెండు ప్రాణాలు తీసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.