Actor prudhvi raj at Kadapa: కడపలోని శివారెడ్డి అర్బన్ రెసిడెన్షియల్ హోంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో సినీ నటుడు పృథ్విరాజ్ పాల్గొన్నారు. అనాథ పిల్లలకు భోజనాలు వడ్డించి.. వారితో సరదాగా గడిపారు. త్వరలో తాను ఓ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తానని పృథ్వీరాజ్ వెల్లడించారు.అర్బన్ రెసిడెన్షియల్ హోం స్థలంపై కొంతమంది కళ్లు పడ్డాయని.. దయచేసి ఆ స్థలాన్ని వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పృథ్వీరాజును చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. పలువురు ఆయనతో సెల్ఫీ తీసుకున్నారు.
వారే నన్ను మోసం చేశారు..
రాష్ట్రంలో వైకాపా పాలన సాఫీగా సాగుతోందని పృథ్వీరాజ్ అన్నారు. '11ఏళ్ల నుంచి వైకాపాలో కొనసాగుతున్నా. ఏనాడు పదవులు ఆశించలేదు. ఎంతో మందిని పార్టీలోకి తీసుకొచ్చా. ఇప్పుడు వారే నన్ను మోసం చేశారు' అని పృథ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి..: సినిమా టికెట్ ధరలు పెరిగేలా చూడాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా: ఆర్జీవీ