గుంటూరు జిల్లా నల్లపాడులో వైకాపా నేత హడావిడిపై ఎస్పీ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తన దృష్టికి తీసుకురాకపోవడంపై సీఐకి ఛార్జి మెమో జారీ చేశారు. మరో కానిస్టేబుల్‌ను.. సస్పెండ్ చేశారు. మొత్తం వ్యవహారంపై డీఎస్పీ కమలాకర్‌తో విచారణ జరిపించారు. పోలీస్ స్టేషన్‌లో హడావిడి చేసిన వైకాపా నేతను పోలీసులు అరెస్టు చేశారు.
నిన్న పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కాటంరాజు యాదవ్... తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. ఫిర్యాదు తీసుకోవటం లేదని ఆరోపిస్తూ అర్ధనగ్నంగా నిరసన చేశారు. అసభ్య పదజాలంతో పోలీసులను దూషించారు. తాను తలుచుకొంటే హోం మంత్రి దగ్గరే పంచాయితీ పెడతానని హెచ్చరించారు. ఈ వ్యవహారంపైనే ఎస్పీ ఆగ్రహించి.. చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: