ETV Bharat / city

నారా లోకేశ్‌పై గుంటూరు తూర్పు డీఎస్పీకి ఎమ్మెల్యే నాగార్జున ఫిర్యాదు - నారా లోకేశ్‌పై వైకాపా నేతలు ఫిర్యాదు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని గుంటూరు తూర్పు డీఎస్పీకి వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఫిర్యాదు చేశారు. సోమవారం గుంటూరులో నారా లోకేశ్​.. తనపట్ల ఏక వచనంతో సంబోధిస్తూ, కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నారా లోకేశ్‌పై గుంటూరు తూర్పు డీఎస్పీకి వైకాపా నేతల ఫిర్యాదు

author img

By

Published : Aug 17, 2021, 8:21 PM IST

Updated : Aug 17, 2021, 10:18 PM IST

రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి గుంటూరు వచ్చిన తెదేపా నేత నారా లోకేశ్​.. తనను ఏక వచనంతో సంబోధిస్తూ.. కులం పేరుతో దూషించారని వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. దీనికి సంబంధించి లోకేశ్​పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని గుంటూరు తూర్పు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు బాధలో ఉంటే తెదేపా నాయకులు శవ రాజకీయాలకి పాల్పడ్డారని వ్యాఖ్యానించారు.

నారా లోకేశ్​ వచ్చేవరకు రమ్య మృతదేహాన్ని తరలించడానికి వీలులేదంటూ.. తెదేపా నాయకులు తమను అడ్డుకున్నారని నాగార్జున తెలిపారు. మేము శాంతియుతంగా ఉన్నప్పటికీ.. లోకేశ్​ రాగానే తనపట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ.. దూషించారని పేర్కొన్నారు. దళిత ఎమ్మెల్యే అయిన తనపై ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. తక్షణమే నారా లోకేశ్​పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక వైకాపా నేతలతో కలసి వెళ్లి గుంటూరు తూర్పు డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

ఇదీ చదవండి...

Lokesh Kurnool Tour: చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఇతరులకేం చేస్తారు: లోకేశ్

Last Updated : Aug 17, 2021, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.