గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మేకతోటి సుచరిత... జగన్ మంత్రివర్గంలో చోటు సంపాదించుకుంది. ఫిరంగిపురంలో జన్మించిన సుచరిత... పీజీ చదివారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2006లో రాజకీయ ప్రవేశం చేసిన సుచరిత... 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థిగా గెలుపొందారు. 2019లో మరోసారి ప్రత్తిపాడు నుంచి విజయం సాధించారు. ఎస్సీ మహిళ... విద్యావంతురాలు కావడం వల్ల.... జగన్ తన మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు.
మేకతోటి సుచరిత
నియోజకవర్గం: ప్రత్తిపాడు
వయస్సు: 48
విద్యార్హత: బీఏ
రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందా
గుంటూరు జిల్లాలో సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణకు మరోసారి మంత్రిగా అవకాశం లభించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా... ఆయనకున్న అనుభవం దృష్ట్యా అమాత్య యోగం దక్కింది. 1999, 2004, 2009లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలి రెండుసార్లు కూచినపూడి నియోజకవర్గం నుంచి గెలుపొందగా... 2009లో రేపల్లె నుంచి విజయం సాధించారు. రాజశేఖరరెడ్డి హయాంలో మోపిదేవి మంత్రిగా పనిచేశారు.
మోపిదేవి వెంకటరమణ
నియోజకవర్గం: రేపల్లె
వయస్సు: 55 సంవత్సరాలు
విద్యార్హత: బీకాం
రాజకీయ అనుభవం: మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు.