ETV Bharat / city

జిల్లాలో కరోనా ఉద్ధృతి.. 351కి చేరిన కేసులు - corona updates in guntur

గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మొత్తం కేసుల సంఖ్య 351కి చేరినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు జిల్లాలో రెడ్​జోన్​ మాత్రమే ఉందని.. గ్రీన్​, ఆరెంజ్​ జోన్లు లేవని కలెక్టర్​ స్ఫష్టం చేశారు.

జిల్లాలో కరోనా ఉద్ధృతి.. 351కి చేరిన కేసులు

author img

By

Published : May 5, 2020, 9:49 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 13 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 351కి చేరింది. నరసరావుపేటలో కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ 26 రోజుల వ్యవధిలోనే బాధితుల సంఖ్య 153కి పెరగడంపై ప్రజలు భయానికి గురవుతున్నారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న వరవకట్ట, రామిరెడ్డిపేట, ఏనుగుల బజార్, పెద్దచెరువు, పాతూరు, నిమ్మతోట ప్రాంతాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. పోలీసులు ఆయా ప్రాంతాల్లో లాక్​డౌన్​ పటిష్టంగా అమలు చేస్తున్నారు.

అర్బన్​లో తగ్గుముఖం...

గుంటూరు అర్బన్ పరిధిలో కేసుల ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇవాళ పాత కంటెయిన్​మెంట్​ జోన్లలో రెండు కేసులే నమోదయ్యాయి. గుంటూరు అర్బన్ పరిధిలో పక్కా ప్రణాళికతో అధికారులు వైరస్​ వ్యాప్తిని అడ్డుకోగలిగారు. ఇప్పటి వరకూ గుంటూరులో 150 కేసులు నమోదయ్యాయి.

రెజ్​జోన్​ మాత్రమే

జిల్లాలో ప్రస్తుతం 351 కేసులు పాజిటివ్​గా నమోదు కాగా... ఇప్పటికే 128 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. ఇంకా 215 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లా రెడ్​జోన్​గా ఉందని... వేరేగా ఆరెంజ్, గ్రీన్ జోన్లుండవని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో కరోనా పరిస్థితిని పరిశీలించేందుకు కేంద్రం నుంచి వైద్యారోగ్య శాఖ నిపుణుల బృందం గుంటూరు, నరసరావుపేటలో పర్యటించే అవకాశముంది.

ఇదీ చూడండి..

భౌతికదూరం లేకపోతే ఇక్కడ సీసా దొరకదంతే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.