ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మూడు రాజధానుల పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చిచ్చు పెట్టారని మాజీమంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. అమరావతి కోసం 151 గంటల నిరాహారదీక్ష చేస్తూ... గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవిచంద్ర, శ్రీకర్లను ఐకాస నేతలతో కలిసి ఆయన పరామర్శించారు. శాంతియుతంగా నిరాహారదీక్ష చేస్తున్న వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి ఆసుపత్రికి తీసుకురావటాన్ని తప్పుబట్టారు. ఇలాంటి చర్యలు పోలీసులు, ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి.. శ్రుతిమించిన ఉపాధ్యాయుని అరాచకాలు