ఇదీ చదవండి :తాపీ మేస్త్రీ బలవన్మరణం... ఇసుక కొరతే కారణం...!
"ఇసుక దందాలతోనే.. తాపీమేస్త్రీ నాగబ్రహ్మాజీ బలి" - తాపీ మేస్త్రీ నాగ్రబ్రహ్మజీ ఆత్మహత్య వార్తలు
వైకాపా నేతల ఇసుక దందాలతోనే తాపీమేస్త్రీ బలయ్యారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ ఆరోపించారు. ఇసుక వాటాలపై చూపిన శ్రద్ధ కూలీల ఉపాధిపై సీఎం చూపటం లేదని విమర్శించారు.
tdp leader kala fire on governamnent over sucide of naga brahamaji
వైకాపా నేతల ఇసుక దందాలతోనే తాపీమేస్త్రీ నాగబ్రహ్మాజీ బలయ్యారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని సంగంజాగర్లమూడిలో నాగబ్రహ్మాజీ ఆత్మహత్య చేసుకోవటం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక కొరతతో కూలీలు పడుతున్న ఇబ్బందులకు నాగబ్రహ్మాజీ ఆత్మహత్యే సాక్ష్యమని దుయ్యబట్టారు. ఉపాధి లేక కార్మిక కుటుంబాలు పస్తులు ఉంటున్నా సీఎం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇసుక వాటాలపై చూపిన శ్రద్ధ... కూలీల ఉపాధిపై చూపటం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నాగబ్రహ్మాజీ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :తాపీ మేస్త్రీ బలవన్మరణం... ఇసుక కొరతే కారణం...!
sample description