గుంటూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన జంగాల రమాదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెదేపా, సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. 8వ డివిజన్లోని నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, తెదేపా రాష్ట్ర కార్యదర్శి జాగర్లమూడి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికలలో తెదేపా, తెదేపా మద్దతిచ్చిన అభ్యర్థులను గెలిపిస్తే పెంచిన మున్సిపల్ పన్నులను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. మున్సిపల్ ఎన్నికలతో వైకాపా నియంత పోకడలకు అడ్డుకట్టవేస్తామని శ్రీనివాస్ పేర్కొన్నారు. 8వ డివిజన్ అభ్యర్థి జంగాల రమాదేవిని గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి: