వైద్యం సామాన్యుల దరికి చేరాలని... ఈ వృత్తిని చేపట్టే వారు సామాజిక బాధ్యతగా భావించి వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. డాక్టర్స్ డే సందర్భంగా గుంటూరు సీపీఎం కార్యాలయంలో 'వైద్యం - నైతిక విలువలు - సామాజిక బాధ్యత' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి యాస్మిన్ పాల్గొన్నారు. జనవిజ్ఞాన వేదిక, ప్రజారోగ్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు పలువురు వైద్యులు, అభ్యుదయ వాదులు హాజరయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలను సూచించారు.
ఇదీ చదవండి :