'ఆర్టీసీ విలీనం సమస్యలను పరిష్కరించండి' - rtc employees protest news in guntur
ఆర్టీసీ విలీనం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... గుంటూరు బస్టాండ్ ఎదుట కార్మికులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఆర్టీసీ విలీనం ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని... ఆ చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ రూట్లలో ప్రైవేట్ బస్సులను నిలిపివేయాలని కోరారు. కార్మికుల ట్రేడ్ యూనియన్‌పై ఆంక్షలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి... అన్ని కేటగిరీల్లో రెగ్యులర్ పోస్టులకు నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు.
గుంటూరులో ఒక రోజు నిరహార దీక్ష చేపట్టిన ఆర్టీసీ కార్మికులు