రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్... ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు ఆరోపించారు. మార్చిలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను కరోనా సాకుతో నిలిపివేసి... కొవిడ్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో నిర్వహిస్తామనడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మోపిదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బ తీసేలా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రమేష్ కుమార్ నిర్ణయాలు ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు. ఎస్ఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మాని, ఇప్పటికైనా ప్రభుత్వంతో కలిసి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: