ETV Bharat / city

నేరాలకు అడ్డాగా శివారు ప్రాంతాలు.. భద్రత పెంచిన పోలీసులు

author img

By

Published : Sep 16, 2021, 10:55 PM IST

గుంటూరు జిల్లాలో పట్టణ, గ్రామ శివారు ప్రాంతాలు నేరాలకు అడ్డాలుగా మారాయి. రాత్రివేళ మద్యం సీసాలతో మందుబాబులు విచ్చలవిడిగా సంచరిస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో జరిగిన అనేక ఘటనల వల్ల పోలీసులు శివారు ప్రాంతాల్లో భద్రత పెంపుపై ప్రత్యేకదృష్టి సారించారు.

గుంటూరులో నేరాల కట్టడికి భద్రత పెంపు
గుంటూరులో నేరాల కట్టడికి భద్రత పెంపు
గుంటూరులో నేరాల కట్టడికి భద్రత పెంపు

గుంటూరు జిల్లాలో వరుసగా జరుగుతున్న నేర ఘటనలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. ప్రధానంగా నగర, పట్టణ, గ్రామ శివార్లలో నేరాలు అధికంగా జరుగుతున్నాయి. చీకటి పడితే చాలు ఆయా మార్గాల్లో వెళ్లేందుకు మహిళలు, విద్యార్థినులు జంకుతున్నారు. తాడేపల్లి సమీపంలోని నదీతీరంలో అత్యాచార ఘటనతోపాటు మేడికొండూరులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలు ఈ అంశాన్నే గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దృష్టి సారించారు.

మంగళగిరి, తెనాలి, నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతికి వెళ్లే రహదారులు, శివారు ప్రాంతాలు, జాతీయ రహదారుల్లో రాత్రిపూట సంచారంపై నిఘా పెట్టారు. నగర శివారు ప్రాంతాల్లో అర్బన్ ఎస్పీ నేరుగా పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న వారి వివరాలు, సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతిరోజూ పోలీసు సిబ్బందితో బ్లూ కోట్స్ వాహనాలు, రక్షక్ వాహనంతో పెట్రోలింగ్ ముమ్మరం చేసి అల్లరి మూకల కదలికలపై నిఘా ఉంచాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.

శివారు ప్రాంతాల్లో మద్యం తాగడం నేరాలకు పరోక్షంగా కారణమవుతుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. గతంలో మద్యం దుకాణం పక్కనే పర్మిట్ రూమ్‌కు అనుమతించేవారు. ప్రస్తుతం పర్మిట్‌ రూంలు లేనందున కొందరు మందుబాబులు స్నేహితులతో కలిసి శివారు ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇలా గుంపులుగా కొంతమంది ఒకచోటుకు చేరడం నేరాలకు ఆస్కారమిస్తోందని పోలీసులు భావిస్తున్నారు. తాడేపల్లి, మేడికొండూరు ఘటనలు కూడా మద్యం మత్తులో చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో నేరాలు జరగకుండా పోలీసులు మరింత భద్రత పెంచాల్సిన అవసరముందని ప్రజలు అంటున్నారు. శివారు ప్రాంతాల్లోనూ పోలీసులు రాత్రివేళ్లలో కవాతు నిర్వహిస్తే ఇలాంటి ఘటనలకు ఆస్కారముండదని చెబుతున్నారు.

ఇదీచదవండి.

Rayalaseema Lift Irrigation: 'ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందా ?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.