People Protest: గుంటూరు జిల్లా ఫిరంగీపురంలో దారుణం జరిగింది. తెనాలి చంద్రయ్య అనే వ్యక్తి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గోళ్లపాలెం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులకు, చంద్రయ్యకు డబ్బులు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గోళ్లపాలేనికి చెందిన నలుగురు వ్యక్తులు చంద్రయ్యను తీవ్రంగా కొట్టారు. దీంతో మనస్తాపం చెందిన చంద్రయ్య ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చంద్రయ్య మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. దాడి విషయం పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. న్యాయం చేయాలంటూ మృతదేహంతో పీఎస్ వద్ద ధర్నా చేపట్టారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: అర్హత లేకున్నా ఆలయాల్లో తిష్ఠ... కోర్టు కేసుతో దిద్దుబాటు చర్యలు