Lokesh on Mangalagiri Issue: మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, వైకాపా నేతలు కలిసి చేస్తున్న విధ్వంసం చూస్తుంటే బాధేస్తోందని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఉండే నియోజకవర్గంలో పేదలకు చోటు లేదంటూ ఒక పక్క ఇళ్లను కూల్చేస్తున్నారు. మరో పక్క.. సీఎం అనుచరులు పేదలకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
కాజా గ్రామంలో బడ్డీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్న మహిళ శివ కుమారిని వైకాపా నేతలు, అధికారులు వేధించడం అన్యాయమన్నారు. సీఎం ఆదేశించారని.. వెంటనే దుకాణం మూసేయ్యాలని బెదిరించడమే కాకుండా ఏకంగా మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి సామాన్లు తీసుకువెళ్లడం చూస్తుంటే.. ఇక ఈ రాష్ట్రంలో ప్రజలు బ్రతికే పరిస్థితులు లేవని తేలిపోయిందని ధ్వజమెత్తారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలను లోకేశ్ విడుదల చేశారు.
ఇదీ చదవండి : "నాకు ఏడువేలిస్తే.. ఎలాంటి సమస్యా ఉండదు.."