ETV Bharat / city

RAILWAY LINE: పరుగులు పెడుతున్న నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైను పనులు - RAILWAY LINE

గుంటూరు జిల్లాతో పాటు కోస్తా, మెట్టప్రాంతాలకు అనుసంధానంగా నిర్మిస్తోన్న నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైనులకు కదలిక వచ్చింది. కొవిడ్ కారణంగా కొన్నాళ్లుగా పనులు ఆగిపోగా.. నడికుడి- శావల్యాపురం మధ్య 45 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పనులకు రంగం సిద్ధం చేస్తున్నారు. 45 రోజుల వ్యవధిలో వీటిని పూర్తిచేస్తామంటున్న అధికారులు.. మిగిలిన దశల పనుల్లోనూ పురోగతి సాధిస్తేనే పూర్తి ఫలితాలు కనిపించే అవకాశముంది.

RAILWAY LINE
RAILWAY LINE
author img

By

Published : Oct 17, 2021, 5:38 PM IST

పరుగులు పెడుతున్న నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైను పనులు

రాష్ట్రంలో నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైను.. అటు కోస్తా ప్రాంతాన్ని, ఇటు మెట్ట ప్రాంతాన్ని అనుసంధానం చేసే కీలకమార్గం. కోస్తా మెట్టప్రాంతాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చగలిగే.. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గంలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. దిల్లీ- చెన్నై, హౌరా, చెన్నై ప్రధాన రైల్వేమార్గాలకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన ఈ రైల్వే మార్గం.. నవ్యాంధ్ర అభివృద్ధికి జీవనాడి వంటిది.

గుంటూరు జిల్లా నడికుడి జంక్షన్ నుంచి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వరకూ.. 308 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైను మార్గాన్ని నిర్మించాలని ఏళ్ల కిందటే ప్రతిపాదించారు. దీనికి సర్వే పనులు పూర్తై.. కొత్త లైను నిర్మాణానికి.. రైల్వే శాఖ పచ్చజెండా ఊపిన తరువాత సైతం చాలా కాలంపాటు పనులు ప్రారంభం కాలేదు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఈ రైల్వే లైనుపై దృష్టి సారించడంతో.. భూసేకరణను కూడా త్వరితగతిన పూర్తయ్యాయి. అప్పటి నుంచి పనుల పురోగతి ఊపందుకుంది. రూ. 2,300 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు తొలిదశలో గుంటూరు- హైదరాబాద్ మార్గంలోని నడికుడి వద్ద నుంచి.. గుంటూరు- గుంతకల్ మార్గంలోని శావల్యాపురం వరకూ రూ. 350 కోట్లతో ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. తొలిదశ మార్గాన్ని రెండు భాగాలుగా విభజించారు. నడికుడి- రొంపిచర్ల వరకూ 30 కిలోమీటర్ల భాగం ఇప్పటికే పూర్తి కాగా.. రొంపిచర్ల- శావల్యాపురం మార్గంలోని మిగతా భాగం కూడా ట్రాక్ నిర్మాణం పూర్తయింది. ట్రాక్ నిర్మాణం పూర్తయినప్పటికీ విద్యుద్దీకరణ పనులు పూర్తి కావాల్సి ఉంది.

''రైతులు పండించిన పంటను ఎగుమతి చేసుకునేందుకు రైలు మార్గం ఉపయోగకరంగా ఉంటుంది. మా ఊరు నుంచి బెంగళూరు, చెన్నై నగరాలకు ప్రయాణ సమయం, దూరం తగ్గుతుంది. ఇంతకు ముందు గుంటూరుకు వెళ్లి సరకు రవాణా చేయాల్సివచ్చేది. ప్రయాణ సమయం కలసి వస్తుంది.'' - శ్రీనివాసరావు, నెమలిపురి

'' రైలు మార్గం త్వరగా అందుబాటులోకి రావాలని చుట్టుపక్కల గ్రామాల వారందరూ కోరుకుంటున్నారు. అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించడానికి ఈ మార్గం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.'' - పుల్లయ్య, నకరికల్లు

నడికుడి-శ్రీకాళహస్తి మధ్యన రైల్వే లైనులో అక్కడక్కడా.. హైదరాబాద్- గుంటూరు, విజయవాడ- బెంగళూరు ప్రధాన లైను కూడా కలుస్తుంది. ప్రస్తుతం ఉన్న హౌరా- చైన్నై, హైదరాబాద్, చెన్నై మార్గాల మధ్య రైళ్ల రాకపోకలు పెరగడంతో ఆ లైన్లపై ఒత్తిడి పెరుగుతోంది. విజయవాడ నుంచి..చెన్నై వరకూ.. ఉన్న మార్గమంతా.. డెల్టా ప్రాంతంలో ఉండటంతో.. తుపాన్లు, వరదల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ప్రతిపాదించిన.. నడికుడి-శ్రీకాళహస్తి మార్గం దీనికి సమాంతరంగా మెట్టప్రాంతాల గుండా వెళుతుంది. గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంతో పాటు, ప్రకాశం జిల్లాలోని దర్శి, పామూరు, అద్దంకి, నెల్లూరు జిల్లాలోని రాపూరు, ఆత్మకూరు, వెంకటగిరి ప్రాంతాల నుంచి వెళుతుంది. గుంటూరు, ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో పండే.. ప్రత్తి, మిరప, పొగాకు వంటి వాణి్జ్య పంటల రవాణాకు.. సిమెంట్, గ్రానైట్ ఉత్పత్తులు తరలించడానికి ఈ రైల్వేలైను ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

''2018 డిసెంబర్ నాటికి తొలిదశ పనులు పూర్తి చేసి గుంతకల్ -గుంటూరు మార్గానికి దీనిని అనుసంధానించేందుకు రైల్వే వర్గాలు ప్రయత్నించినప్పటికీ.. రెండేళ్లుగా కుదిపేస్తున్న కరోనా ఆటంకంగా మారింది. దీంతో కొత్తగా ఏర్పాటు చేసిన నెమలిపురి రైల్వై స్టేషన్లు, ఇతర సదుపాయాలు అలంకార ప్రాయంగా మారాయి. విద్యుద్దీకరణ పనులను త్వరితగతిన పూర్తిచేయనున్నాం. తొలుక ఈ మార్గంలో కొన్ని నెలలు సరకు రవాణా గూడ్సులను నడిపిన తరువాత ప్రయాణీకులతో కూడిన రైళ్లను నడపాలని యోచిస్తున్నాం.'' -మోహన్ రాజా, డీఆర్ఎం, గుంటూరు డివిజన్

ఇదీ చదవండి:

NATURAL FARMING: ప్రకృతి వ్యవసాయంలో కళా నైపుణ్యం..నవతరానికి ఆదర్శం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.