గుంటూరులో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య 40వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. సీపీఎం అనుబంధంగా పనిచేసే ఈ సంఘం వేడుకలకు.. ఎమ్మెల్సీ కె. లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'మతోన్మాదం-సవాళ్లు' అనే అంశంపై ఆయన ప్రసంగించారు.
సమకాలీన అంశాలు, సమస్యలపై డీవైఎఫ్ఐ కార్యకర్తలు పోరాడుతున్నారని లక్ష్మణరావు ప్రశంసించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుకు కృషి చేయాలని.. ఇతర ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు. పేద, గ్రామీణ విద్యార్థులకు.. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: