గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రు గ్రామంలో.. ఒక గోదాములో అక్రమంగా నిలువ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. అక్రమంగా.. లారీలో ఈ బియ్యాన్ని తరలిస్తున్నారని జిల్లా విజిలెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో తనిఖీలు చేపట్టారు.
బియ్యాన్ని తరలిస్తున్న వాహనంతోపాటు 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై జాయింట్ కలెక్టర్ కు నివేదిక సమర్పించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి : ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. తండ్రీ కుమార్తె మృతి