గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఓ చోరీ కేసులో అనుమానంతో చల్లా సుబ్బారావు అనే యువకుడిని గ్రామీణ పోలీసులు బుధవారం స్టేషన్కు తీసుకువచ్చారు. విచారణ పేరుతో పోలీసులు చావబాదారని.. దెబ్బలు తట్టుకోలేక భవనంపైనుంచి దూకానని బాధితుడు వాపోయాడు. పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాని చెప్పినప్పటికీ వినలేదని.. తీవ్రంగా కొట్టాడని బాధితుడు ఆరోపించాడు. తీవ్ర గాయాలైన సుబ్బారావును పోలీసులు మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని వైద్యశాలకు తరలించారు.
ఇదీ చదవండి:సత్తివానిపాలెం అధికారులపై వైకాపా నేతల దాడి... అసలేం జరిగిందంటే..?
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!