రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికలు వాయిదా వేశారన్న కారణంతో ఎస్ఈసీపై వైకాపా నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని గుర్తు చేశారు. ఒక బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపితే కౌన్సిల్ను రద్దు చేశారని అన్నారు. ఇలాంటి అరాచకాలు మునుపెన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. అహంకారపూరిత చర్యలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తుంటే హైకోర్టును కూడా రద్దు చేస్తారేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. సీఎంగా జగన్ ప్రమాణం చేసినప్పటి నుంచి కక్షసాధింపు చర్యలు తప్ప చేసిందేమీ లేదని ఆక్షేపించారు. ఉద్యోగుల జీతాల్లో కోత వేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: