ETV Bharat / city

'నా ఇంట్లో అద్దెకు దిగి... నా భర్తనే వలలో వేసుకుంది' - గుంటూరు తాజా నేర వార్తలు

నాలుగు పదుల వయసు దాటిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఓ వివాహితురాలు. ఇదేంటని ప్రశ్నించినందుకు అతని భార్యపైనే దాడికి దిగింది. నిస్సహాయురాలైన బాధితురాలు... తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన గుంటూరులో జరిగింది.

ILLEGAL aFFAIR
ILLEGAL aFFAIR
author img

By

Published : Oct 5, 2020, 10:25 PM IST

ఇంట్లో అద్దెకు చేరి.. ఆ ఇంటి యజమానిని వలలో వేసుకుంది ఓ మహిళ. వారి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు అతని భార్యపై దాడి చేసింది. తన కాపురాన్ని చక్కదిద్దాలని కోరుతూ బాధితురాలు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు శ్రీలక్ష్మి నగర్​కి చెందిన మస్తాన్ బీ, జేజిబాబు భార్యభర్తలు. వీరికి పెళ్లీడుకు వచ్చిన ఓ కుమారుడు ఉన్నాడు. ఏ బాధలు లేని ఆ ఇంట్లో ఓ మహిళ అగ్గి రాజేసింది. మూడు సంవత్సరాల నుంచి వారి ఇంటిలో అద్దెకు ఉంటున్న ఓ మహిళ... జేజిబాబుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె మోజులో పడ్డ అతను... కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయసాగాడు.

విషయం తెలుసుకున్న మస్తాన్​ బీ... ఆ మహిళను ఇల్లు ఖాళీ చేయాలని కోరింది. అద్దెకు ఉంటున్న ఆ మహిళ... మరో ఇద్దరు వ్యక్తులను తీసుకువచ్చి యజమాని భార్యపై దాడి చేసింది. జేజిబాబు అండతోనే ఈ ఘటన జరగిందని అతని భార్య తెలుసుకుంది. చేసేది ఏమి లేక భాదితురాలు, ఆమె కొడుకు సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని... తన కాపురాన్ని చక్కబెట్టాలని ఆమె విన్నవించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.