కరోనా ముప్పు మెల్లగా తగ్గుముఖం పడుతుండగా గుంటూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ చాపకింద నీరులా చుట్టేస్తోంది. రోజుల వ్యవధిలోనే బాధితుల పరిస్థితి విషమంగా మారుతోంది. చికిత్సలో కీలకమైన యాంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్ల కొరత పట్టిపీడిస్తోంది. జీజీహెచ్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో మూడొంతుల మందికి ఇంజెక్షన్లు అందుబాటులో లేవంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా పోసాకొనాజోల్ వినియోగిస్తూ నష్టాన్ని కాస్త నివారించగలుగుతున్నారు. బ్లాక్ ఫంగస్‌తో పోరాడుతూ గుంటూరు జీజీహెచ్‌లో ఇప్పటికి 20 మంది మరణించడం కలవరపెడుతోంది.
ఇంజెక్షన్లే కాక కీలకమైన వైద్య పరికరాల కొరత వేధిస్తోంది. ఫంగస్ నిర్ధరణ, వ్యాప్తిని గుర్తించే పరికరాలు, తీవ్రతను తెలుసుకునేందుకు ప్రత్యేక కెమెరాల అవసరముంది. ఉన్న వనరులతోనే వీలైనంత వేగంగా వైద్యమందిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అన్నారు. ఇంజెక్షన్ల కొరత తీర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీచదవండి.