గుంటూరు జిల్లా కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త వహించాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ సూచించారు. ప్రజలు బయటకు వచ్చేప్పుడు కచ్చితంగా నిబంధనలు పాటించాలని కలెక్టర్ శామ్యూల్ అన్నారు. చాలా చోట్ల మాస్కులు లేకుండా ప్రజలు తిరుగుతున్నారని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ లాక్ ప్రక్రియ తర్వాత జూన్ నెల నుంచి ఇప్పటి వరకు 1095 కేసలు నమోదయ్యాయన్నారు.
గుంటూరులో 31 ఆసుపత్రులను కరోనా కేసుల చికిత్స కోసం సిద్ధంగా ఉంచామని తెలిపారు. కరోనా పాజిటివ్ 80 శాతం కేసులలో ఎటువంటి లక్షణాలు కనబడటం లేదని, 20 శాతం కేసుల్లో మాత్రమే లక్షణాలు ఉన్నాయని.. అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఇదీ చదవండి: వసతి గృహాల నిర్మాణంపై కర్ణాటక, తితిదే మధ్య ఒప్పందం