తిరుమల సందర్శించే బ్రహ్మణుల కోసం తిరుపతిలో ఉచిత అన్నప్రసాద వితరణ వసతి కేంద్రం ప్రారంభిస్తున్నట్లు వసతి కేంద్ర సభ్యులు రామరాజు శ్రీనివాసరావు తెలిపారు. 'శ్యామల నిత్యాన్నదాన వితరణ కేంద్రం' పేరుతో తిరుచానూరు రోడ్డులోని పద్మావతిపురంలో ఈనెల 14న కేంద్రం ప్రారంభమవుతుందన్నారు.
వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే బ్రాహ్మణులకు స్నానం, సంధ్యావందనం చేసుకునే వసతితోపాటు, అల్పాహారం, భోజనం, ఉచితమని తెలిపారు. తిరుపతికి చెందిన వ్యాపారవేత్త సాయిస్వామి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలనుకునే బ్రాహ్మణులు వివరాల కోసం 9440437221 ఫోన్ నంబర్‌కు సంప్రదించవచ్చన్నారు.
Greyhound Centre: విశాఖ జిల్లాలో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం.. ప్రతిపాదనకు ఆమోదం