అక్రమ కేసులతో వేధిస్తుండటం కారణంగానే మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు మానసికంగా ఆందోళనకు గురై... ఆసుపత్రి పాలయ్యారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. గుంటూరులోని శ్రీలక్ష్మి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోడెలను తెదేపా నేతలు ఆనందబాబు, జీవీ ఆంజనేయులు పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఒత్తిళ్లు అధికం కావడం వల్లే శివప్రసాదరావు ఆరోగ్యం దెబ్బతిన్నదని ఆరోపించారు. కోడెల అనారోగ్య పరిస్థితికి వైకాపా ప్రభుత్వ ఒత్తిళ్లే కారణమని తెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం తెదేపా నేతలపై అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు.
ఇదీ చదవండీ...