ETV Bharat / city

'విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాల్ని అమలు చేశాం' - guntur mayor latest news

తెదేపా నేతలు తమ ఉనికిని కాపాడుకోవడానికే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. రెండేళ్ల పాలనలో అభివృద్ధి శున్యమని తెదేపా నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

deputy speaker inagurated guntur deputy mayor chambor

author img

By

Published : Jun 5, 2021, 2:29 PM IST

కరోనా కారణంగా అనుకున్న మేరకు అభివృద్ధి పనులు చేపట్టలేకపోయినా.. అభివృద్ధి శూన్యమనే విమర్శ వాస్తవం కాదని ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు తమ ఉనికిని కాపాడుకోవడానికే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాల్ని ఆగకుండా అమలు చేస్తున్నామని వివరించారు. ఇలాంటి సమయంలో కూడా రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు.

గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబు ఛాంబర్​ను ఎంపీ మోపిదేవి వెంకటరమణతో కలసి ఉపసభాపతి కోన రఘుపతి ప్రారంభించారు. గుంటూరు నగరాభివృద్ధికి ప్రజాప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ఇదీ చదవండి:

నా ఫోన్ ఇచ్చేయండి.. సీఐడీ అదనపు డీజీకి రఘురామ లీగల్ నోటీసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.