ETV Bharat / city

జిల్లాలో కొత్తగా 393 కరోనా పాజిటివ్ కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా ఉధృతి కొంచెం తగ్గింది. తాజాగా.. 393 మందికి కరోనా సోకింది.

author img

By

Published : Sep 26, 2020, 9:02 PM IST

corona cases
corona cases

కరోనా కేసులు మొదటి నుంచి ఎక్కువగా ఉన్న జిల్లాల్లో గుంటూరు ఒకటి. జిల్లాలో శనివారం నాడు కొత్తగా 393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 54 వేల 313కు చేరుకుంది. అలాగే జిల్లాలో ఇవాళ కొత్తగా 3 మరణాలు సంభవించాయి. వీటితో కరోనా మరణాల సంఖ్య 514కు చేరుకుంది. ఇప్పటి వరకు కొవిడ్ నుంచి కోలుకుని 46 వేల 89 మంది ఇళ్లకు చేరుకున్నారు.

ఇవాళ నమోదైన కొత్త కేసుల్లో గుంటూరు నగరంలోనే అత్యధికంగా 58, బాపట్లలో 44, ఉన్నాయి. ఇక జిల్లాలోని తాడేపల్లిలో 35, నర్సరావుపేట 32, మంగళగిరి 26, రేపల్లె 26, ముప్పాళ్ల 24, వట్టిచెరుకూరు 18, చిలకలూరిపేట 13, ప్రత్తిపాడు 12, పెదకాకాని 11, కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బులిటెన్ విడుదల చేశారు. మిగతా మండలాల్లో 96 కేసులు వచ్చాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకూ 5లక్షల 7వేల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరంలోనే 15 వేలు దాటాయి. నర్సరావుపేట పట్టణంలో 3వేల 659, తెనాలి పట్టణంలో 2వేల 376 కేసులు నమోదయ్యాయి.

ఎలాంటి లక్షణాలు లేని వారు మాత్రమే హోం ఐసోలేషన్ లో ఉండాలని.. అనారోగ్య సమస్యలు కనిపించిన వెంటనే వచ్చి ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2వేల, ప్రైవేటు ఆసుపత్రుల్లో 3వేల 289 పడకలు కొవిడ్ కోసం కేటాయించారు. జిల్లాలో కేసుల నమోదు చూస్తే మార్చి నెలలో 9, ఏప్రిల్ లో 277, మేలో 214, జూన్ లో 1095 వచ్చాయి. జులై, ఆగస్టు నెలల్లో కేసులు విజృంభించాయి. జులైలో 14వేల 692 కేసులు, ఆగస్టులో 21వేల 93కేసులు రాగా.. సెప్టెంబర్ నెలలో ఇప్పటి వరకూ 16వేల 448 కేసులు నమోదయ్యాయి. గత నెలతో పోలిస్తే కేసుల నమోదు కొంచెం నెమ్మదించినా ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉన్నాయి.

ఇదీ చదవండి:

తెలంగాణ: హేమంత్ హత్యకు పథకం ఇలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.