ETV Bharat / city

గుంటూరులో తెదేపా నేతలపై కర్ఫ్యూ ఉల్లంఘన కేసు - corona news

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించారంటూ జీజీహెచ్​​ పర్యటనకు వెళ్లిన తెదేపా నేతలపై కొత్తపేట పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.

police case on tdp leaders
తెదేపా నేతలపై కర్ఫ్యూ ఉల్లంఘన కేసు
author img

By

Published : May 25, 2021, 9:11 PM IST

గుంటూరు జీజీహెచ్​లో కోవిడ్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తెదేపా నాయకులపై కొత్తపేట పోలీసుస్టేషన్​లో కేసు నమోదైంది. ఈ నెల 24న కరోనా బాధితులకు భరోసా పేరుతో ఆస్పత్రుల్లో వైద్యసేవలను పరిశీలించేందుకు తెలుగుదేశం పార్టీ పిలుపునివ్వగా.. జీజీహెచ్​కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఇతర నేతలను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ గేటు ముందు బైఠాయించిన నేతలను కొత్తపేట స్టేషన్​కు తరలించారు.

కరోనా సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించారంటూ తాజాగా వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

గ్రామంలో స్వయంగా శానిటైజ్ చేసిన రవికిషన్

'పేదల నోటి దగ్గర ముద్దను లాక్కుంటారా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.