ఆంధ్రా బ్యాంకులో రక్తదాన శిబిరం ఆంధ్రాబ్యాంకు ప్రారంభించి 96 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా... గుంటూరు జోనల్ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆంధ్రాబ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ... బ్యాంకు 97వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. సుమారు 100 మంది ఉద్యోగులతో రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. సేకరించిన రక్తాన్ని ఎన్టీఆర్ బ్లడ్ వారికి అందించినట్లు వివరించారు.
ఇదీ చదవండి: వృద్ధురాలికి అండగా అధికారిణి.. ఆశ్రమానికి తరలింపు