ETV Bharat / city

గుంటూరులో భాజపా పోరుయాత్ర వాహనానికి నిప్పు.. ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు - తెనాలి

Public rally vehicle తెనాలిలో భాజపా ప్రజాపోరు యాత్ర వాహనానికి కొందరు దుండగులు నిప్పుపెట్టారు. ఈ తెల్లవారుజామున 4 గంటలకు చోటుచేసుకుంది. మంటలు రావడంతో అప్రమత్తమైన స్థానికులు వాటిని అదుపు చేశారు. ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులు వివరాలు సేకరించారు.

BJP public rally vehicle
భాజాపా పోరుయాత్ర వాహనానికి నిప్పంటినచిన దుండుగులు
author img

By

Published : Sep 30, 2022, 11:18 AM IST

Updated : Sep 30, 2022, 11:39 AM IST

BJP public rally vehicle: గుంటూరు జిల్లాలో భాజపా ప్రజా పోరు యాత్ర వాహనానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. తెనాలిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. భాజపా ప్రజా పోరు యాత్ర వాహనం ఈనెల 21నుంచి తెనాలిలో తిరుగుతోంది. సుల్తానాబాద్​లోని రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపి ఉంచారు. ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ప్రచార రథానికి కొందరు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.

ఒక్కసారిగా మంటలు రావడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై అర్పివేశారు. నలుగురు వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రభుత్వ అరాచకాల్ని ప్రజా పోరు ద్వారా ప్రజలకు వివరిస్తున్నందునే అధికార పార్టీకి చెందినవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భాజాపా నేతలు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 30, 2022, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.