ప్రైవేటు పాఠశాలల్లో నిర్బంధ ఆంగ్లమాధ్యమం అమలు చేయడం వల్ల ఇప్పటికే 48 శాతం పిల్లల్లో తెలుగు కనుమరుగైందని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. పోటీ ప్రపంచంలో ఆంగ్లంతోపాటు తెలుగు ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు. తాడేపల్లి నివాసంలో జగన్ను ఆయన కలిశారు. తనకు తెలిసిన ఓ రోగికి సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సాయం చేయాలని కోరుతూ సీఎంను కలిసినట్లు సోము వీర్రాజు తెలిపారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని సీఎం జగన్ సహా నిపుణుల కమిటీని కోరినట్లు వెల్లడించారు. పార్టీలు మారే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: