Guntupalli Seshagiri Rao: టీఎన్‌టీయూసీ గౌరవాధ్యక్షులు గుంటుపల్లి శేషగిరిరావు జన్మదిన వేడుకలను గుంటూరు తెదేపా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. టీఎన్‌టీయూసీ కార్మికులంతా రాష్ట్రంలో చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని తెలిపారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు సీఎం కావాల్సిన అవశ్యకత ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో టీఎన్‌టీయూసీ నాయకులంతా విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్‌కుమార్, గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు నసీర్ అహ్మద్, కోవెలమూడి రవీంద్ర, పలువురు నాయకులు పాల్గొన్నారు. నేతలంతా శేషగిరిరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చదవండి: