ETV Bharat / city

ATTACK: దళిత యువకుడిపై వైకాపా నేత దాడి.. ఎందుకంటే! - attack on a young man by ysrcp leader

నిడుబ్రోలు గ్రామానికి చెందిన వైకాపా నేత అంకినీడు చౌదరికి సంబంధించిన స్థలంలో బోరు వేసేందుకు వెళ్లిన యువకుడిపై సదరు నేత అనుచరులు దాడికి పాల్పడ్డారు. రోజులు గడుస్తున్నా పనికి అవసరమైన వస్తువులు తేకపోవడంతో.. తనకు రావలసిన కూలి చెల్లించాలని కోరడంతో దాడి చేసినట్లు బాధితుడు వాపోయాడు. దీనిపై ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపాడు.

ysrcp leader attack on a dalith at nidubrolu
దళిత యువకుడిపై వైకాపా నేత దాడి
author img

By

Published : Jul 10, 2021, 7:47 PM IST

దాడిపై వివరాలు తెలుపుతున్న బాధిత కుటుంబం

వైకాపా నాయకుల అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండల తహసీల్దార్ పెంచల ప్రభాకర్​పై స్థానిక వైకాపా నాయకుల దాడి మరువకు ముందే మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా దళిత యువకుడిపై పొన్నూరు వైకాపా నాయకుడు కర్రలతో దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే..

గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం నిడుబ్రోలు గ్రామానికి చెందిన వైకాపా నేత అంకినీడు చౌదరికి(ANKINEEDU CHOWDARY) సంబంధించిన స్థలంలో బోర్లు వేసేందుకు 12 రోజుల క్రితం చేబ్రోలు మండలం నారా కోడూరు గ్రామానికి చెందిన రాజేశ్​ అనే యువకుడు వెళ్లాడు. బోరు పనులు పూర్తై నాలుగు రోజులు గడిచినా పంపు ఏర్పాటు చేసేందుకు అవసరమైన సామాన్లు తీసుకురావడంలో సదరు నేత ఆలస్యం చేశాడు. దీంతో అప్పటివరకు రావలసిన కూలి చెల్లించాలని రాజేశ్​ ప్రశ్నించాడు. రోజు కూలిపై బతికే తనకు ఇబ్బందిగా ఉందని.. అర్థం చేసుకుని సొమ్ము చెల్లించాలని కోరాడు. దీనిపై ఆగ్రహం చెందిన వైకాపా నేత, అతని అనుచరులు కర్రలు, పైపులతో తనపై దాడి చేసినట్లు బాధితుడు రాజేశ్​ తెలిపాడు. దీనికితోడు ద్విచక్రవాహనాన్ని, అధార్​, ఏటీఎం కార్డులను బలవంతంగా లాక్కున్నారని వాపోయాడు. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. తనపై దాడి చేసిన వారిని శిక్షించాలని విజ్ఞప్తి చేశాడు.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వారు సాయంత్రం వరకు కేసు నమోదు చేయలేదని.. పైగా కేసు పెట్టడానికి వెళ్లిన తనను ఇబ్బంది పెట్టారని బాధితుడు తెలిపాడు. చివరికి పోలీసులు వైకాపా నేత అంకినీడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపాడు.

"కూలీ డబ్బులు అడిగినందుకు నన్ను చిత్రహింసలు పెట్టారు. దాడి చేసిన చౌదరి అతని అనుచరులను కఠినంగా శిక్షించాలి." - బాధితుడు రాజేశ్​

"నా కుమారుడిపై దాడి చేసిన పోలీసులు స్టేషన్​కు పిలిచి విచారణ జరపాలి. తనకు తగిన న్యాయం చేయాలి." - లక్ష్మి (బాధితుడి తల్లి)

తమ ప్రాంతంలో దళితులపై తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయని.. వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్థానికులు అంటున్నారు. రాజేశ్​పై దాడి చేసిన వ్యక్తిని క్షమించేది లేదని.. అతడిని ప్రభుత్వం కఠినంగా శిక్షించే వరకు పోరాడుతామని అంటున్నారు. అధికారంలో ఉన్న నేతలే ఇలా ప్రవర్తించడం సరికాదని.. ఇటువంటి దాడులను తాము సహించేది లేదని వారు అంటున్నారు.

ఇదీ చదవండి:

TDP: 'రాంకీ అవకతవకలకు.. నైతిక బాధ్యతగా రామకృష్ణారెడ్డి రాజీనామా చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.